![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -637 లో.....జ్యోత్స్న నిజస్వరూపం పూర్తిగా దాస్, కార్తీక్ కి తెలిసిపోతుంది. నేను నీ కూతురు అని తెలిసినప్పటి నుండి ఒక జత బట్టలు అయినా కొన్నావా.. కొనలేదు.. ఎందుకు అంటే నాకు బట్టలు కొనాలంటే నువ్వు జేబులు తడుముకోవాలి.. ఛీ అని జ్యోత్స్న అనగానే దాస్ కోపంగా జ్యోత్స్న అని అంటాడు. నేను ఊసింది నీ మీద కాదు.. మన బతుకుల మీద..... నానమ్మ పిల్లల్ని మార్చేసిందని నీకు తెలుసు.. అయినా నువ్వు సైలెంట్ గా ఉన్నావ్.. ఎందుకంటే నీ కూతురు రాణిలాగా బ్రతకడం నీక్కూడ ఇష్టమే కానీ ఇప్పుడు ఏదో మారిపోయి నిజం చెప్తానని వచ్చేసావ్.
ఇప్పుడు శౌర్య నా కూతురు అంటూ ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తానంటే శౌర్య వెళ్తుందా.. వెళ్ళదు ఎందుకంటే బావ చూసుకున్నంత బాగా తనని ఇంకెవరు చూసుకోలేరు.. నేను కూడా అంతే దశరథ్, సుమిత్ర కూతురు నేనే.. ఈ ఆస్తులకి వారసురాలిని నేనే అని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడే వెళ్లి అందరికి నిజం చెప్పేస్తానని దాస్ అంటాడు. నువ్వు వెళ్తే ఈ మేడ మీద నుండి దూకేస్తానని జ్యోత్స్న అంటుంది. అప్పుడు నిజం తెలిసి మా అమ్మ చచ్చిపోతుంది. ఆ తర్వాత మా డాడీ.. తాత.. ఎవరు ఉండరు అని జ్యోత్స్న అంటుంది.. నా కూతురిని చుస్తే భయంగా ఉందిరా అని కార్తీక్ తో దాస్ అంటాడు. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి మావయ్య అని కార్తీక్ అతన్ని పంపిస్తాడు. మరొక వైపు దీప, శ్రీధర్, కాంచన ఇంటికి వెళ్తారు. కార్తీక్ ఎందుకో పార్టీలో టెన్షన్ గా కనపడ్డాడు అని కాంచన, శ్రీధర్ అనుకుంటారు. ఏమైందని దీపని అడుగుతారు. నిజంగానే బావకి జ్యోత్స్న ఏదో గురించి తెలిసినట్లు ఉందని దీప అనుకుంటుంది. నాకేం తెలియదని దీప అనగానే మీరు ఏం చెప్తారు.. ఏం చెప్పరని కాంచన కోప్పడుతుంది. మరొకవైపు దాస్ వెళ్ళిపోయాక కార్తీక్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకోమని కార్తీక్ అంటాడు. సరే ఒక పని చెయ్ బావ.. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటానని జ్యోత్స్న అంటుంది.
ఏంటది అని కార్తీక్ అడుగుతాడు. నన్ను పెళ్లి చేసుకోమని జ్యోత్స్న అనగానే నాకు ఆల్రెడీ పెళ్లి అయిందని కార్తీక్ అంటాడు. ఆల్రెడీ పెళ్లి అయిన దీపనే పెళ్లి చేసుకున్నావ్ కదా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎలా అయితే దీపని నీ భార్య అని ఫీల్ అవుతున్నావో నేను కూడా ఈ ఆస్తులకి వారసురాలిని అని ఫీల్ అవుతున్నానని జ్యోత్స్న అంటుంది. నిజం ఒప్పుకోమని కార్తీక్ అనగానే ఒప్పుకోనని జ్యోత్స్న అంటుంది. నీ నోటితో నువ్వే నిజం ఒప్పుకునేలా చేస్తానని జ్యోత్స్నతో కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి మాట్లాడుతుంటే సుమిత్ర, దశరత్, శివన్నారాయణ వస్తారు. ఎందుకు అత్తయ్య ఎప్పుడు జ్యోత్స్నని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారని సుమిత్ర అంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్లి దీపకి దిష్టి తీస్తాడు. ఏంట్రా అలా తీస్తున్నావని కాంచన అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |